Tuesday, 16 August 2016

Snehithudo



స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో శ్రామికుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
నీ కోసం వచ్చేశాడూ
ఆకాశం తెచ్చేశాడూ
అడగకముందే అందించే సాయం ... ఇతడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం 
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం 
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగిందా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బులా విసిరిందా

మండుతున్న ఎండలోన
నీడ కాసే.. గొడుగు వీడే
చేదు నిండే గుండెలోనా
తీపి పుట్టే కబురు వీడే
ఏ చిన్ని గాయం నీ మీదున్నా
మోసే హృదయం ఇతడు
పసివాడీ కన్నులతోనా లోకాన్నే చూస్తాడు
దండిచే వాడికి తానే
గుండెలోతు కూడా ప్రేమా అందిస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

రాతలోనా గీతలోనా భాగ్యరేఖై పూసినాడు
అందమైన జాతకంలా సంబరాలే తెచ్చినాడు

నీ చిన్ని చిన్ని సరదాలన్నీ తీర్చే తొలి స్నేహితుడు
ఏ పరిచయము లేకున్నా ప్రాణం పంచిస్తాడు
సెలవంటూ వెళ్ళిపోతున్నా పండగలని చెవులు తిప్పి లాకొస్తాడు

స్నేహితుడో సేవకుడో
ఎవరో ఎవరో ఇతడెవరో
ప్రేమికుడో

ఎగిరే ఎగిరే ఆకాశం 
గువ్వై  రెమ్మనా వాలినదా
చిగురులు తొడిగే అవకాశం 
మళ్ళీ తోటకు వచ్చినదా
నవ్వుల్ల్ పువ్వుల్ దరహాసం
పెదవులు పడవై సాగినదా
రంగుల్ రవ్వల్ సంతోషం
మనసుని మబ్బులా విసిరిందా


                                  

No comments:

Post a Comment