Tuesday, 16 August 2016

Malleal Vaanala



                 
               మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
మనసే మనిషై పుట్టేసిందే నీలా ఇలా
ముద్దొస్తుందే నీలో హ్యుమానిజం
అచ్చై పోయే చిట్టి గుండె లోతులో
నచ్చావే తొట్టతొలి చూపులో
నా కంటి కలకు పొద్దెన్నీ కలలో
పడిపోయే నీ ప్రేమలో

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
పడిపోయా నీ ప్రేమలో..

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా

ఇన్నాళ్లు ఏమయ్యావే ఏ దిక్కున దాక్కునావో
ఇవాల్లే ఇంతదంగా నా కంట్లో పడ్డావో
పున్నమిలో పుట్టావో వెన్నెల నీ పేరంటావో
ఆల్చిప్పలో ముత్యంలాగా స్వచ్చంగా మెరిసేవో
అందానికి హుందాతనము జత చేరినా
దేవతలా నడిచోచ్చావు నేల బారునా
ఆకర్షించే కొత్త కొంగొడుగా
నే ఫిదా అయ్యానే

నాలాగా నువ్వంటా నీలాగా నేనంటా
అనుకోకుండా ఇలా కలిసింది మా జంట

నీ ఇంటి పేరే జాలి
నీ మాటే చల్ల గాలి
నీ కంటి చూపే నాకు రాగాల జోలాలి
నువ్వే నా దీపావళీ
నువ్వే నా రంగుల హోలీ
నీ గుండెల్లోన ఖాళి నీతోనే నిండాలి
సూర్యోదయాన సుబ్బలక్ష్మి భక్తి పాటలా
మదర్ దెరిస్సాలోని మంచి మాటలా
చుట్టు ముట్టావే నన్ను అన్ని వైపులా
నే ఫిదా అయ్యా

మల్లెల వానలా మంచు తుఫానులా
ముంచేసిందే  నీలో మంచితనం
పడిపోయా నీ ప్రేమలో..

చూస్తున్నా చూస్తున్నా
నను నీలో చూస్తున్నా
ఇస్తున్నా ఇస్తున్నా
మనసే రాసిస్తున్నా



        

No comments:

Post a Comment