Monday, 15 August 2016

Em sandhem Ledu


                                   

ఏం సందేహం లేదూ
ఆ అందాల నవ్వే
ఈ సందళ్లు తెచ్చింది
ఏం సందేహం లేదూ
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లూ ఇచ్చింది
ఏం సందేహం లేదూ
ఆ గంధాల గొంతే
ఆనందాలూ పంచింది

నిమిషము నేల మీద 
నిలవని కాలిలాగా
మది నిను చేరుతుంది చిలకా
తనకొకా తోడులాగా
వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా
ఏం సందేహం లేదూ
ఆ అందాల నవ్వే
ఈ సందళ్లు తెచ్చింది
ఏం సందేహం లేదూ
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లూ ఇచ్చింది

వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది 
నువ్వే గుర్తొస్తూ ఉంటే
నా కళ్లలోకొచ్చీ నీ కళ్లాపే జల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదురిక రాదు అన్న నిజమును మోసుకుంటూ
మది నిను చేరుతుంది చిలకా
తనకొకా తోడులాగా
వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖా
వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది 
నువ్వే గుర్తొస్తూ ఉంటే

నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలో కెళ్లి
కూ అంటుంది వినవా
నీ మబ్బులో జల్లు ఆ ముంగిట్లో పూలు
పూయిస్తే చాలన్నావే
ఏమవుతున్నా గాని ఏమయినా అయిపోనీ
ఏం ఫర్వాలేదన్నావా 
అడుగులు వెయ్యలేక అటు ఇటు తేల్చుకోక
సతమతమైనా గుండె గనకా
అడిగిన దానికింక బదులిక పంపుతుంది
పదములు లేని మౌన లేఖా






No comments:

Post a Comment