Friday, 23 September 2016

Chiguraaku Chaatu Chiluka


చిగురాకు చాటు చిలకా ఈ అలజడి ప్రేమేగా
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా
చిగురాకు చాటు చిలకా తను నడవదా ధీమాగా 
అనుకోని దారి గనకా ఈ తికమక తప్పదుగా
తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా
ఐతే అది తేలనిదే అడుగుపడదుగా
చిగురాకు చాటు చిలకా ఆ అలజడి ప్రేమేగా 
అలవాటు లేదు గనక మది సులువుగా నమ్మదుగా

చెప్పకు అంటూ చెప్పమంటూ చర్చ తేలేనా  తప్పనుకుంటూ తప్పదంటూ తర్కమాగేనా
సంగతి చూస్తూ జాలి వేస్తూ కదలలేకున్నా  తేలనిగుట్టు తేనెపట్టు కదపలేకున్నా
వణికే నా పెదవుల్లో తొణికే తడి పిలుపేదో నాకే సరిగా ఇంకా తెలియకున్నదీ
తనలో తను ఏదేదో గొణిగే ఆ కబురేదో ఆ వైనం మౌనంలో మునిగి ఉన్నదీ
చిగురాకు చాటు చిలకా తను నడవదా ధీమాగా
 అనుకోని దారి గనకా ఈ తికమక తప్పదుగా

ఎక్కడనుంచో మధురగానం మదిని మీటింది  ఇక్కడ నుంచీ నీ ప్రయాణం మొదలు అంటోంది
గలగలవీచే పిల్లగాలి ఎందుకాగింది కొంపలు కూల్చే తుఫానుచ్చే సూచనేమో ఇది
వేరే ఏదో లోకం చేరే ఊహల వేగం ఏదో తీయని మైకం తెంచుతున్నదీ
దారే తెలియని దూరం తీరే తెలపనీ తీరం తనలో కలవరమేదో రేపుతున్నదీ




No comments:

Post a Comment