Friday, 23 September 2016

Le Le LeLe Ivaale Lele



లే లే లే లే  ఈ వాలే  లే లే లే లే లే లే ఈ రోజల్లే లే లే 
వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే రెండటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే ఉంటేనే పోతుంటాయి బాధలే/లేలేలే/

చిరుగాలై నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే, సుడిగాలై చుట్టేయాలి లే లే
గొడుగల్లే పనిచేయాలి నిన్నే కదిలిస్తుంటే, వడగల్లే పనిపట్టాలి లే లే
నీరల్లే పారాలి అందరి దాహం తీర్చాలి/2/ 
అణిచేస్తే ముంచేయాలి లే 
నేలల్లే ఉండాలి అందరి భారం మొయ్యాలి, విసిగిస్తే భూకంపాలే చూపాలే
లే లే లే లే ఈ వాలే లే లే లే లే లే  లే ఈ రోజల్లే లే లే 

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉందీ, చెడ్డోల్లకి చెడు చేయడమే మంచి
చేదుంది తీపి ఉంది భేధం వేరే ఉంది చేదన్నది ఉన్నప్పుడేగా తీపి
ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవుంది/2/ ఎటుకైనా గమ్యం ఒక్కటే లే లే
బ్రతుకుంది చావుంది చచ్చేదాకా బ్రతుకుంది చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే

No comments:

Post a Comment