Friday, 23 September 2016

Doboochu laatelara Gopaala



దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా/2/
ఆ యేటి గట్టునేనడిగా, చిరు గాలి నాపి నేనడిగా/2/
ఆకాశన్నడిగా బదులే లేదూ/2/
చివరికి నిన్నే చూశా హృదయపు గుడిలో చూశా/2/
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

నా మది నీకొక ఆటాడు బొమ్మయా
నాకిక ఆశలు లేవయా ఎదలో రొద ఆగదయా
నీ అధరాలు అందించ రా గోపాలా
నీ కౌగిళ్ళో కరిగించ రా నీ తనువే ఇక నా వెల్లువా
పాలకడలి నాది నా గానం నీ వన్నె మారలేదేమి
నా ఎదలో చేరి వన్నె మార్చుకో ఊపిరి నీవై నే సాగ
పెదవుల మెరుపు నువు కాగ , చేరగ రార
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా

గగనము వర్షించ గిరినెత్తి కాచావూ
నయనాలు వర్షించ నన్నెట్టా బ్రోచేవు పోవున కన్నె నీ మతమా
నేనెక్క స్ర్తీనే కదా గోపాలా అది తిలకించ కనులే లేవా నీ కలలే నేనే కాదా
అనుక్షణము ఉలికే నా మనసు, అరె మూగ కాదు నా వయసు
నా ఊపిరిలోనా  ఊపిరి నీవై ప్రాణం పోనీకుండా ఎప్పుడూ నీవే అండ 
 కాపాడా రారా
దోబూచులాటేలరా గోపాలా నా మనసంతా నీవేనురా


No comments:

Post a Comment