Sunday, 18 September 2016

Mundhu Nuyya



ముందు నుయ్యా, వెనుక గొయ్యా
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయా
ఏటిలోకి లాగేనయ్యా

కూతకొచ్చిన కుర్రావాడు
కూలబడుతూ లేస్తున్నాడు
బక్కపలచ పిల్లగాడూ
భారమెత్తుకుంటున్నాడూ
దిక్కుతోచక ఉన్నాగానీ
ఒక్కడే అవుతున్నా గానీ
మనసునేమో  ఇక్కడ వదిలీ
మనిషి మాత్రం నడవాల్సిన గతీ
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంతా చిత్రంరా /2/

వీడి వీడి తస్సదియ్యా 
వీడికెంత కష్టమయ్యా
ఏమిటో ఈ ప్రేమ మాయా
ఏటిలోకి లాగేనయ్యా

ఊరు కొత్తా నీరు కొత్తా 
ఉండవలసినా తీరు కొత్తా
ఎదురయ్యా ప్రతి వారు కొత్తా
ఎదురు చూస్తా ఎట్టా ఎట్టా
చిలక పక్కన లేకుండానే 
గోరువంకా ఎగిరేదెట్టా
పౌరుషానికి పోయినప్పుడు
పోరు తప్పదు అది తెలిసిన బతుకు
ఎంత చిత్రం ఎంత చిత్రం 
ఎంతెంతా చిత్రంరా... /2/

చూడు చూడు చిన్నవాడు 
ప్రేమలో పడిపోయాడు
లోకమేదో చూడనోడు
లోతులో దిగిపోయాడు

భారమేమే బోలెడంతా
రూపమేమో వేలెడంతా
సమస్యమో సింధువంతా
వయసుయేమో బింధువంతా
ఆశయం ఆకాశమంతా
అనుభవం మరి అంతంతా
పరువు కోసం పేరు కోసం 
ప్రాణమంటి ప్రేమ కోసం
జారిపోయిన విలువల కోసం
విలువ కలిగిన గెలుపు కోసం
పట్టుదలనే పెట్టుబడిగా 
పెట్టదలచిన పిల్లవాడికి
ఎంత కష్టం ఎంత కష్టం 
ఎంతెంతా కష్టంరా..














No comments:

Post a Comment