పరీక్షలు పరీక్షలు పరీక్షలు పాడు పరీక్షలు పాఠాలు రాకపోయినా
పరీక్షలు వచ్చి కూచున్నాయి.
పరీక్షలెలా ఎగొట్టడట్టం
ఆ......
కడుపులో నొప్పి వచ్చిందని వంక పెడితే సరి
అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులో/2/
ఫస్ట్ క్లాసులో పాసౌదామని పట్టుపట్టి నే పాఠాల్ చదివితే /2/
పరీక్షనాడే పట్టుకన్నదే బడికెట్లాగే వెళ్ళేదే/అమ్మా/
బాబు లేవరా ఈ మందు తాగరా
పరీక్షకోసం దిగులుపడకురా వచ్చే ఏటికి పాసౌదువులే /2/
నువు బాగుంటే మాకు చాలురా
నీక్షేపంగా ఇంటనుండరా /బాబు/
అయ్యో గారెలా అయ్యెయ్యో బూరెలా
పరీక్షలొచ్చే బాబు కోసమని కమ్మ కమ్మగా నేను చేస్తినే/2/
అయ్యనోట శని పట్టేను ఏమో
మాయలమారి నొప్పులొచ్చెనే
అయ్యో గారెలా అయ్యోయ్యో బూరెలా
అమ్మా పాయెనే అమ్మమ్మా పాయెనే
అమ్మా ఒక్కటే అమ్మమ్మా ఒక్కటే
బాబు తినకురా నీ కడుపునొప్పిరా
అమ్మా ఒక్కటే అమ్మమ్మా ఒక్కటే
బుద్ది వచ్చెనా నీకు బుద్ది వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మా బుద్ది వచ్చెనే
లెంపలేసుకో అయితే లెంపలేసుకో
బుద్ది వచ్చెనా
బుద్ది వచ్చెనే అమ్మా బడికి పోదునే బాగా చదువుకుందునే
No comments:
Post a Comment