ఏడుకొండలవాడా వెంకటరమణా/2/
సద్దు చేయక నీవు నిదురపోవయ్మా
పాలసంద్రపుటలలు పట్టెమంచముగా/2/
పున్నమి వెన్నెలలు పూల పానుపుగా/2/
కనులనొలికే వలపు పన్నీరు జల్లిగా
అన్ని అమరించే నీ అలివేలుమంగా /2/ఏడుకొండల
నా పాలి దైవమని నమ్ముకున్నానయ్యా
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మా పొంచి ఉన్నాదయ్యా/2/
చాటు చేసుకు ఎటులో చెంత చేరేదనయ్యా /ఏడు కొండల
No comments:
Post a Comment