ఎడ్లు బాయే గొడ్లు బాయే ఎలమ దొరల మంద బాయే
కోడి బాయే లచ్చమ్మది కోడి పుంజు బాయే లచ్చమ్మది
కోళ్ళ కమ్మ నేను పోతే కందీరీగ కరచిపాయే/2/
బస్సు బాయే బండి బాయే రేణిగుంట రైలు బాయే
మళ్ళి తిరగ చూడబోతే గాలి మోటారెల్లిపాయే /2/
అరె...రె....రె...............................
దూడబాయే లచ్చమ్మది లేగ దూడ బాయే లచ్చమ్మది /కోడి/
కొండ బాటనొస్తుంటే కోయిలమ్మ కూస్తుంటే
వాగు బాటనొస్తుంటే వాయిలాల చప్పుడాయే
మందనంతా గెదుముకుంటా ఇంటిదారినొస్తంటే
పోతు బాయే లచ్చమ్మది మేకపోతు బాయే లచ్చమ్మది / కోడి/
లచ్చన్నదారిలోనా లంబాడి ఆటలాయే
జిగులాడి సంతలోనా పోతులింగడి గంతులాయే
బంతి పూలు తెంపబోతే తుమ్మెదొచ్చి కరచిబాయే
గంప బాయే లచ్చమ్మది పూల గంప లచ్చమ్మది /కోడి/
No comments:
Post a Comment