Thursday, 1 December 2016

Chesedi Yemito




చేసేది ఏమిటో చేసేయి సూటిగా 
వేసెయ్యి పాగా ఈ కోటలో /2/
ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని /2/
నీ మాట దక్కించుకో బాబయ్య/చేసేది/

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా
ఇక  కాయలి బంగారు కాయలు
భోంచేయాలి మీ పిల్లకాయలు/చేసేది /

రహదారి వెంట మొక్కనాటి పెంచరా
కలవాడు లేనివాడు నిన్ను తలచురా/2/
భువిన తరతరాలు నీదు పేరు నిలుచురా
పనిచేయు వాడే  ఫలముల లారగించురా /చేసేది/





No comments:

Post a Comment