ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకులు జడన చుట్టి
జడన చుట్టీ...
హంసలా నడిచివచ్చే చిట్టెమ్మ
చిట్టెమ్మా....
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.... /ముద్దబంతి/
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది
వయసు ఉంది...
ఇంత కన్నా ఉండేదేది కిట్టయ్యా
కిట్టయ్యా...
ఈ పేదవాళ్ళు తెచ్చేదేది చెప్పయ్యా /అద్దమంటి/
పుట్టింటి అరణాలు...
ఘనమైన కట్నాలు....
అత్తవారింటి నిండా వేసినా
అవి అభిమానమంతా విలువ చేతునా /ముద్దబంతి/
అభిమానం ఆభరణం
మర్యాదే భూషణం
గుణము మంచిదైతే చాలయా
మన గొప్పతనము చెప్పుకోను వీలయా /అద్దమంటి/
కాలు చేయి లోపమనీ...
కొక్కిరాయి రూపమనీ...//2//
వదినలు నన్ను గేలి చేతురా
పిల్లను పెట్టి పెళ్ళి చేతురా
ఎవరేమి అన్ననేమి /2/
ఎగతాలి చేయ్యనేమి
నవ్విన నాప చేను పండదా
నలుగురు మెచ్చు రోజు ఉండదా /అద్దమంటి/
No comments:
Post a Comment