ఆడవాళ్ల కోపంలో అందమున్నది
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది/అర్ధమున్నది/
మొదటిరోజు కోపం అదో రకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు/పొత్తుకుదరదు
పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసుపిల్ల తగలగానే లోన లోటారం /2/
వగలాడి తీపి తిట్టు
తొలివలపు తేనె పట్టు
ఆ తేనె కోరి చెంత చేర చెడమడ తిట్టు /బ్రహ్మచారి/
పెళ్ళికాని వయసులోని పెంకి పిల్లలు
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు
వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం
వెంట పడితే వీపు విమానం /ఆడవాళ్ళ/
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాస్ వర్డ్ పజిల్ వంటిది /2/
ఆ పజిల్ పూర్తి చేయి
తగు ఫలితముండునోయి
మరుపురాని మధురమైన ప్రైజ్ దొరుకునోయి / ఆడవాళ్ళ/
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు.
No comments:
Post a Comment