Friday, 3 February 2017

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని/2/

అయినా కుదరుగా ఎదుట కూర్చని గాలి గట్టిగా పిల్చుమా
స్వామి స్వామి..
ఏమి ఏమి
నేను పిల్చిన గాలి నిలువక ఆకటా మీపై విసిరెనే..
ఆకట మీపై విసిరెనే.
అందుకే మరి
అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని

అయిన కన్నులు మూసి చూపును ముక్కు కొనపై నిలుపుమా
స్వామి స్వామి..
ఈ మారేమి
ఆచట నిలువకా చూపులన్నీ అయ్యో మీ పై దూకెనే
అయ్యో మీ పై దూకెనే
అదేమరీ

అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమే భామినీ
కష్టమైననీ ఇష్టమేననీ కోరి నిలిచితి చినముని

No comments:

Post a Comment