ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
దాగిపోయే /2/
పొందుగోరు చిన్నవాని తొందరేమో..
మూడుముళ్ళ మాట కూడా మరచిపొయే...
తోచదాయే
పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో
ఎందుకోసమో....
పైటకొంగు కులికింది ఎవరికోసమో
ఎవరికోసమో
నీలోని పొంగులు నావేననీ/2
చెమరించు నీ మేని తెలిపెలే
పొందుగోరే చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే
తోచదాయే
కొంటె చూపు రమ్మంది ఎందుకోసమో
ఎందుకోసమో
కన్నె మనసు కాదంది ఎందుకోసమో
ఎందుకోసమో
సరిఅయిన సమయం రాలేదులే /2
మనువైన తొలిరేయి మనదిలే
ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
దాగిపోయే
ఎన్నాళ్ళు మనకీ దూరాలు
ఏనాడు తీరునీ విరహాలు /2/
కాదన్న వారు ఔనన్ననాడు
కౌగిళ్ళ కరిగేది నిజములే..
ముందరున్న చిన్నదాని అందమేమో..
చందమామ సిగ్గు చెంది సాగిపోయే...
దాగిపోయే
పొందుగోరే చిన్నవాని తొందరేమో
మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే
తోచదాయే
No comments:
Post a Comment