Friday, 3 February 2017

Nadireyi Ye Jamulo




నడిరేయి ఏ జాములో స్వామి 
నిను చేర దిగివచ్చునో
 తిరుమల శిఖారాలు దిగివచ్చునో /2/

మముగన్న మాయమ్మా అలివేలుమంగమ్మా/2/
పతిదేవు ఒడిలోన మురిసేటివేళా
స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళా
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుతో మా మనవి వినిపించవమ్మా

ఏడేడు శిఖరాల నే నడువలేను
ఏపాటి కానుకలందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేను
నేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా....
మముగన్నమాయమ్మా అలివేలుమంగా........./2/
విభునికి మా మాట వినిపించవమ్మా
ప్రభువుతో మా మనవి వినిపించవమ్మా


కలవారినే గాని కరుణించలేడా
నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బ్రతుకల కనలేని నాడు
స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా
అడగవే మా తల్లీ  అనురాగవల్లీ
అడగవే మా యమ్మా అలివేలుమంగా

నడిరేయి ఏ జామునో 
స్వామి నిను చేర దిగి వచ్చునో













No comments:

Post a Comment