ఎన్నాళ్ళో వేచిన హృదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్ళు దాచిన హృదయం
ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి
ఈ చీకటి విడిపోదేమి /2/
మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమి చేయదనీ
నీతికి నిలబడు వానికి ఏనాటికి ఓటమి లేదనీ
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే /ఇంకా
నాగులు తిరిగే కోనలో , ఏ న్యాయం పనికిరాదని /2/
కత్తిని విసిరేవానిని ఆ కత్తితోనే గెలవాలనీ
నేనెరిగిన చేదు నిజం
నీతో చెప్పాలని వస్తే /ఇంకా
ఎన్నాళ్ళో వేచిన హృదయం
ఈనాడే ఎదురవుతుంటే
ఇన్నినాళ్ళు దాచిన హృదయం
ఎగసి ఎగసి పోతుంటే
ఇంకా తెలవారదేమి
ఈ చీకటి విడిపోదేమి
No comments:
Post a Comment