ఎవరో వస్తారని ... ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరిచి నిదురపోకుమా
బడులే లేని పల్లెటూర్లలో
చదువు రాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్ రాని పంతుళ్ళకు
ఎవరో తోడు వస్తారని .. ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా /ఎవరో
చాలిచాలని పూరి గుడిసెలో
కాలే కడుపుల పేదలకు
మందులు లేని ఆసుపత్రిలో పడిగాపులు పడు రోగులకు
ఎవరో తోడు వస్తారని
ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా /ఎవరో
తరతరాల మూఢాచారాపు వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి , బలియైపోయే పడతులకూ
ఎవరో తోడు వస్తారని
ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
కూలి డబ్బుతో లాటరీ టికెట్ .. లాటరి టికెట్
కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో భాద్యత నుండి చెడే నిరాశ జీవులకు /ఎవరో తోడు
సేద్యం లేని బీడు నేలలో
పనులే లేని ప్రాణులకు
పగలు రేయి శ్రమ పడుతున్నా ఫలితం దక్కని దీనులకు /ఎవరో తోడు
No comments:
Post a Comment