నీలి మేఘాలలో... గాలి కెరటాలలో...
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునే వేళ
ఏ పూర్వ పుణ్యమో .. నీ పొందుగా మారి/2/
అపురూపమై నిలచే నా అంతరంగాన /నీలి
నీ చెలిమిలో నున్న.. నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే.. మరపింపజేయు/నీలి
అందుకోజాలనీ ఆనందమే నీవు
ఎందుకే చేరువై .. దూరమైతావు
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునే వేళ
No comments:
Post a Comment