అందాల బొమ్మా ఓహొ అందాల బొమ్మా
అందాల బొమ్మా ఓహొ అందాల బొమ్మా
శృంగారంలో బంగారం కలిపి చేశాడే బ్రహ్మ
నిను చేశాడే బ్రెమ్మా
సోకైనా బావ ఓహొ సోకైనా బావా
ఇక గోరంతలు కొండంతలు చేసి కోసేయ్యి బావా
కోతలు కోసేయి బావా
నీ కట్టు నీ బొట్టు నిగ నిగలాడే నీ జుట్టు
ఓహొహో నీ గుట్టు నీ బెట్టు
నీ కట్టు నీ బొట్టు నిగ నిగలాడే నీ జుట్టు
నిజముగా వర్ణన చెయ్యాలంటే
నిజముగా వర్ణన చేయ్యాలంటే
నెలల తరబడే పట్టు,
ఒట్టూ
అందాల బొమ్మా ఓహొ అందాల బొమ్మా
బస్తీలలో చదువుకున్నది
పాఠాలన్నీ ఇవియేనా
బస్తీలలో చదువుకున్నది
పాఠాలన్నీ ఇవియేనా
అయ్యవారి కడ నేర్చుకున్నదీ
ఆడాళ్లను పొగిడే కథలేనా
సోకైనా బావా ఓహొ సోకైనా బావా
టౌను రాజు కావ్యలల్లోనూ, శిల్పులు చెక్కే బొమ్మల్లోనూ
టౌను రాజు కావ్యలల్లోనూ, శిల్పులు చెక్కే బొమ్మల్లోనూ
కొత్తగా వచ్చే నవలల్లోనూ,రోజు చూసే సినిమాల్లోనూ
మహా మునింద్రుల మనసున దోచు సొగసుగత్తెల వర్ణనలే కదా
అందాల బొమ్మా ఓహా అందాల బొమ్మా
సంతోషించితి చాలునోయ్ నీ చాకచక్యము ఆపవోయ్
సంతోషించితి చాలునోయ్ నీ చాకచక్యము ఆపవోయ్
మెచ్చినానులే బహుమానంగా మేక తోలు కప్పింతునోయ్
సోకైనా బావా ఓహొ సోకైనా బావా
ఇక గోరంతాలు కొండంతలు చేసి కోతలు కోసేయ్యి బావా
కోతలు కోసేయి బావా
No comments:
Post a Comment