కన్ను మిన్ను కానరాని కాలి తెరపు గిత్తరా....
పట్టుకుంటే మాసిపోయే పాలపళ్ల గిత్తరా
అరెరె......రేయ్
వంటి మీద చేయి వేస్తే ఉలికి పడే గిత్తరా....ఆ,.....
పొగరుబోతు పోట్లా గిత్తరా
ఓరయ్యా దీని చూపే సింగారమవునురా
ఓరయ్యా దీని రూపే బంగారుమవునురా
ఓరయ్యా దీని చూపే సింగారమవునురా
ఓరయ్యా
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
యనక్కొస్తే ఎగిరి కాలు జాడిస్తుంది
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది
యనక్కొస్తే ఎగిరి కాలు జాడిస్తుంది
విసురుకుంటు, కసురుకుంటు ఇటు అటు అటు ఇటు డిర్ర్........................
గుంక్కీలు పెడుతుంది
కుప్పి గంతులేస్తుంది
పోగరుబోతు పోట్లాగిత్తరా
ఓరయ్యా దీని రూపే సింగారమవునురా
ఓరయ్యా దీని రూపే బంగారమవునురా
అదిలిస్తే రంకె వేయు బెదురుబోతు గిత్తరా
అరెరె....రేయ్
కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరా
దీని నడుము తీరు చూస్తుంటే నవ్వుపుట్టుకొస్తుంది
నడక జోరు చూస్తుంటే వడలు పులకరిస్తుంది
నడుము తీరు చూరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తుంది
నడక జోరు చూస్తుంటే వడలు పులకరిస్తుంది
వన్నె చిన్నెల రాణి ఈవ్వాలే మంచి బోణి
వన్నె చిన్నెల రాణి ఈవ్వాలే మంచి బోణి
నిన్నొదలి పెడితే ఒట్టు నీ వగలు కట్టి పెట్టు
పోగరుబోతు పోట్లాగిత్తరా
ఓరయ్యా దీని చూపే సింగారమవునురా
ఓరయ్యా దీని రూపు బంగారమవునురా
No comments:
Post a Comment