Saturday, 9 September 2017

Chengu Chenguna Gantulu Veyandi




చెంగుచెంగున గంతులు వేయండి
ఓ... జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరులేని తువ్వాయిల్లారా..
చెంగు చెంగున గంతులు వేయండి

రంగురంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజెపుడో..
చెకచెకమంటు అంగలు వేసి చేలను దున్నే అదనెపుడో
కూలిపోయిన సంసారానికి గోదా గింజ పెట్టేదెపుడో.....
కూలిపోయిన సంసారానికి గోదా గింజ పెట్టేదెపుడో.....
ఆశలన్నీ మీ మీద పెట్టుకుని తిరిగే మా వెతలడిగే దెపుడో
చెంగు చెంగున గంతులు వేయండి


పంచభక్ష్య పరమాన్నం తెమ్మని బంతిని కూర్చుని అలగరుగా పట్టుపరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా గుప్పెడు గడ్డితో గుక్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ
చెంగున చెంగున గంతులు వేయండి


పగలనకుండా రేయనకుండా పరోపకారం చేస్తారు
వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు
తెలుగు తల్లికీ ముద్దుబిడ్డలు.. సంపద పెంచే జాతిరత్నములు...
మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బ్రతుకే లేదు...
చెంగుచెంగున గంతులు వేయండి
ఓ... జాతివన్నె బుజ్జాయిల్లారా
నోరు లేని తువ్వాయిల్లారా
చెంగు చెంగున గంతులు వేయండి

1 comment: