ఎక్కడికి నీ పరుగు
ఎందుకని నీ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావ్ ఏం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా అలా
ఆ దరికే నా అడుగు
ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కథలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ప్రేయసీ
ఎక్కడికి నీ పరుగు, ఎందుకని నీ ఉరుకు
నీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావ్ ఏం అలా
అలసట అంతా తీరగా నా ఒడిలో లాలిస్తా అలా
ఆ దరికే నా అడుగు, ఎందుకనో నా ఎదనడుగు
ఏమో ఎక్కడ ఉన్నదో నా కథలో కదిలే చిన్నదీ
నీలో మాత్రం లేదులే నేనన్వేషించే ప్రేయసీ
ఏమే సఖీ కలల చెలీ
ఇక్కడనే నా మజిలీ
జాడను చూపినదే మరి నువు పాడిన తీయని జావళి
వెలిగించావే కోమలి నా చూపులలో దీపావళి
గుండెలలో నీ మురళి ,వెళ్ళదులే నను వదిలీ
తెరిచే ఉంచా వాకిలీ, దయచేయాలని నా జాబిలి
ముగ్గులు వేసిన ముంగిలి అందిస్తున్నది ప్రేమాంజలీ
ఈ రామచిలక సాక్ష్యం
నీ ప్రేమ నాకే సొంతం
చిలిపి చెలిమి రాజ్యం, మనమింక ఏలుకుందాం
కాలం చేరని ఈ వనం విరహాలతో వాడదు ఏ క్షణం
No comments:
Post a Comment