Tuesday, 12 September 2017

Vennello Godari Andam Song lyrics



వెన్నెల్లో గోదారి అందం 
నది కన్నుల్లో కన్నీటి దీపం 
వెన్నెల్లో గోదారి అందం 
నది కన్నుల్లో కన్నీటి దీపం 
అది నిరుపేద నా గుండెలో 
చలి నిట్టూర్పు సుడిగుండమై 
నాలో సాగే మౌన గీతం 
వెన్నెల్లో గోదారి అందం 
నది కన్నుల్లో కన్నీటి దీపం 

జీవిత వాహిని అలలై 
జీవిత వాహిని అలలై 
ఊహకి ఊపిరి వలలై 
బంధనమై...జీవితమే.. 
నిన్నటి చీకటి గదిలో 
ఎదబాటే..ఒక పాటై 
పూల తేనెలో సుమవీణ మ్రోగునా.. 
వెన్నెల్లో గోదారి అందం 
నది కన్నుల్లో కన్నీటి దీపం 

నిన్నటి శర పంజరాలు దాటిన స్వర పంజరాన నిలచి 
కన్నీరే పొంగి పొంగి తెరలచాటు నా చూపులు చూడలేని మంచు బొమ్మనై 
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్నీ చిదిమి చిదిమి 
వెన్నెలంత ఏటి పాలు చేసుకుంటినే 
నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం 
నాకు లేదు మమకారం..మనసు మీద అధికారం 

ఆశలు మాసిన వేసవిలో.. 
ఆవేదనలో...రేగిన..ఆలాపన సాగే 
మదిలో..కలలే..నదిలో వెల్లువలై పొంగాలె.. 
మనసు..వయసు...కరిగి 
స్మరించిన సరాగమె కలతను రేపిన వలపుల 
ఒడిలో..తిరిగే...సుడులే... 
ఎగసే..ముగిసే...కధ నేనా.. 
ఎగసే..ముగిసే...కధ నేనా..




No comments:

Post a Comment