Tuesday, 12 September 2017

Jilibili Palukula song lyrics



జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిల మిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా మైనా 
కలలను పెంచకు కలతలు  దాచకు ఏ మైనా ఓ మైనా
జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవులు వలపుగా చిలికిన ఓ మైనా మైనా

అడగనులే చిరునామా ఏ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నా కైనా
తారలకే సిగ పువ్వా, తారాడే సిరిమువ్వా
తారలకే సిగ పువ్వా , తారాడే సిరిమువ్వా
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికన చిలకవు ఉలకవు పలకవు ఏ మైనా ఏ మైనా
జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా

ఉరుముల్లో అలికిడిగా వినిపించే ఈ మైనా
మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా
ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ
ఎండలకే అల్లాడే వెన్నెలో క్రీనీడ
వినువీధి వీణల్లో రాగాల్లా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేన ఏమైనా
జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులదే  మైనా  మైనా
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగం

మధువుల పెదవుల మమతలు విరసిన ఓ మైనా మైనా
చుక్కలు అందక దిక్కుల దాగిన నేనేలే ఆ మైనా

జిలిబిలి పలుకుల చిలిపిగా విసిరిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మిణుగురు సొగసులతో ఈ మైనా మైనా




No comments:

Post a Comment