Saturday, 9 September 2017

Ennenno Janmala Bandham



ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నటికీ మాయని మమత నాది నీదీ
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నటికీ మాయని మమత నాది నీదీ

పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ
నిన్నే చూచిన వేళా నిండును చెలిమి
ఓహో.... హో..హో.. నువ్వు కడలివైతే
నే నదిగ మారి చిందులు వేసి వేసి
నిన్ను  చేరనా... చేరనా... చేరనా....

ఎన్నోన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నటికీ మాయని మమత నాది నీదీ

విరిసిన కుసుమము నీవై  మురిపించేవు
తావిని నేనై నిన్నుపెనవేసేను
ఓహో..హో..హో.. మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి
ఆడనా... ఆడనా... ఆడనా....

ఎన్నోన్నో జన్మల బంధం నీది నాదీ
ఎన్నటికీ మాయని మమత నాది నీదీ

కోటి జన్మలకైనా కోరే దొకటే
నాలో సగమే ఎపుడూ... నేనుండాలి
ఓహో... హో... హో... నీవున్న వేళా ఆ స్వర్గమేళా
ఈ పొందు ఎల్లవేళలందు 
ఉండనీ ... ఉండనీ...ఉండనీ...

ఎన్నోన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నీను వీడి నేనుండలేను
ఒక్క క్షణం ఈ విరహం నే తాళలేనూ


No comments:

Post a Comment