తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలే నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
రావే కిరణ్
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
నేడే కొండకోన తోడుగా, ఎండ వాన చూడగా, ఈడుజోడుగా
ఎన్నో ఊసులాడగా తోడునీడగా
ఈడు గోదారి పొంగింది చూడు
నా దారి కొచ్చింది నేడు , ఆశ తీరగా
ప్రేమ మాగాణి పండింది నేడు
మా రాణి పారాణి తోటి నన్ను చేరగా
గువ్వల జంటగా ఓఓ... సాగే వేళలో
నవ్వుల జంటగా ఓఓ.. రావే నా కిరణ్
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలుకుతున్నది వలపు సితార
రావే.... ఆకాశాన విల్లుగా , ఆనందాల జల్లుగా
మల్లెలు జల్లగా, ముద్దే నేడు తియ్యగా, తెరే తీయగా
గుండె కొండెక్కి జాబిల్లి వచ్చి ఎండల్లో వెన్నెల్లు తెచ్చి పానుపేయగా
కోటి మందార గంధాలు తోటి అందాల చందాలు నాకు కానుకీయగా
ఊహల లాహిరి ఓఓ... ఉండే వేళలో
నీకే నీవుగా ఓఓ.. రావే నా కిరణ్
తళుకుమన్నది కులుకుల తార
పలకనున్నది వలపు సితార
తళుకుమన్నది కులుకుల తార
పలకనున్నది వలపు సితార
ఓ మైనా వదలనిక ఏమైనా
నాలోనా శృతిలయలు నీవేనా
గుండెల్లోనా నిండే ఊహ నీవే కిరణ్
రావే కిరణ్
Thank you soooooo much for lyrics..
ReplyDelete- Ram Gopal Nadakuditi.