అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... చెల్లెమ్మా
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ..
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... చెల్లెమ్మా
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ..
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామా రామా
ఆశలకు అంతముందా చెప్పమ్మా ...చెల్లెమ్మా
ఆశలకు అంతముందా చెప్పమ్మా... చెల్లెమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగా మనిషి విషమౌతాడు
గడ్డి మేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగా మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా, పాల దోష గుణమా
అది గడ్డి గొప్పతనమా , పాల దోష గుణమా
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా...చెల్లెమ్మా
తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
ముద్దు గులాబికే ముళ్ళుంటాయి
మొగలిపువ్వులోన నాగుంటాది
ముద్దు గులాబికే ముళ్ళుంటాయి
మొగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగు
ఒక మంచిలోన చెడుగు
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా...చెల్లెమ్మా
లోతు్కెలితే కధే వేరు పిచ్చెమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ...
డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడు
ఈ పేదను తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నీవమ్మా
ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు చెల్లెమ్మా
అందమైన లోకమని రంగురంగులుంటాయని
అందరూ అంటుటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ... చెల్లెమ్మా
No comments:
Post a Comment