ఓం ఓం
ఓంకారనాదాను
సంధానమై రాగమే
శంకరాభరణము
ఓంకారనాదాను
సంధానమై రాగమే
శంకరాభరణము
శంకరా...భరణము
శంకర గళ నిగళము శ్రీ హరి పద కమలము
శంకర గళ నిగళము శ్రీ హరి పద కమలము
రాగరత్నమాలిక తరళము శంకరాభరణము
శారద వీణా....ఆ....
శారదవీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
శారదవీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరదా మహతి నినాద గమకిత శ్రావణ గీతము
రసికుల కనురాగమై
రస గంగలో తానమై
రసికుల కనురాగమై
రస గంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము
శంకరాభరణము
అధ్వైత సిద్దికి అమరత్వ లభ్దికి గానమే సోపానము
అధ్వైత సిద్దికి అమరత్వ లభ్దికి గానమే సోపానము
సర్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమే గానము
సర్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమే గానము
త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై
త్యాగరాజ హృదయమై రాగ రాజ నిలయమై
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియే లేని సుధాలప స్వర్గము శంకరాభరణము
No comments:
Post a Comment