Thursday, 15 March 2018

Dorakuna Ituvanti Seva




దొరకునా... దొరకునా... దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ...
దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ


దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ...




రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు..
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
రాగాలనంతాలు.. నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు




నాదాత్మకుడవై... నాలోని చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ...

నాదాత్మకుడవై... నాలోని చెలగి
నా ప్రాణదీపమై.. నాలోన వెలిగే
నిన్ను కొల్చు వేళ దేవాదిదేవా...
దేవాదిదేవా... ఆ... 


దొరకునా ఇటువంటి సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ...




ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు


ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలూ ఎదలోని సడులే మృదంగాలు




నాలోని జీవమై... నాకున్న దైవమై
వెలుగొందువేళ... మహానుభావా
మహానుభావా....


దొరకునా....  సేవ...
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ... దొరకునా ఇటువంటి సేవ...


No comments:

Post a Comment