Friday, 25 May 2018

Urike Chilaka



ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా

ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ 
 
కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు

తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
 
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
 
మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ


Telusa Manasa




తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో

ప్రతిక్షణం  ...  నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో  ...  అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే .. నీవుగా .. ప్రాణమే .. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ

తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో

డార్లింగ్
ఎవెరీ బ్రీథ్ యు  టేక్ .. ఎవెరీ మూవ్ యు  మేక్ 
ఐ  విల్  బి  దేర్ విత్  యు
వాట్  వుడ్  ఐ  డూ  విత్  అవుట్  యు ...
ఐ  వాంట్  టు లవ్  యు  .. ఫర్ఎవెర్ ... అండ్  ఎవెర్  .. అండ్  ఎవెర్ 

ఎన్నడూ  … తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో  … తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ 



తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో


Saturday, 19 May 2018

Lalitha priya kamalam



లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...
ఉదయ రవి కిరణం మెరిసినది 
ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..
ఉదయ రవి కిరణం మెరిసినది 
అమృత కలశముగ ప్రతి నిమిషం
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని..
చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది
 
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల 
పూల దరహాసముల మనసులు మురిసెను

లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ...
ఉదయ రవి కిరణం మెరిసినది 
 
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినది
మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె
వడివడి పరువిడి

ఉదయ రవి కిరణం మెరిసినది 
ఊహల జగతిని.. ఆఆఆ..ఆఆఅ..
లలిత ప్రియ కమలం విరిసినది 
కన్నుల కొలనిని...ఆఆఆఅ..ఆఆ..
లలిత ప్రియ కమలం విరిసినదీ...


Saturday, 5 May 2018

Bommanu Chesi




బ్రతుకంతా బాధగా కలలోని గాథగా
కన్నీటి థారగా కరిగిపోయే
తలచేది జరుగదు
జరిగేది తెలియదు
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
గారఢి చేసి గుండేను కోసి నవ్వేవు  ఈ వింత చాలిక
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక

అందాలు సృష్టించినావు దయతో నీవు
మరల నీచేతితోనే నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాఢాంధకారాన నిలిపేవులే
కొండంత ఆశ అడియాస చేసి పాతాళ లోకాన తోసేవులే
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక

ఒక నాటి ఊద్యానవనము నేడు కనము
అదే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒక నాటి ఊద్యానవనము నేడు కనము
అదే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు
హాలహల జ్వోల చేసేవులే
ఆనందనౌక పయనించు వేళ
ఆనందనౌక పయనించు వేళ
శోకాల సంద్రాన ముంచేవులే
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
గారఢి చేసి గుండేను కోసి నవ్వేవు  ఈ వింత చాలిక
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
గారఢి చేసి గుండేను కోసి నవ్వేవు  ఈ వింత చాలిక








AA MABBUTERLA LONA DAGUNDI CHANDAMAMA




ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ
ఈ సిగ్గు తెరలలోనా బాగుంది  సత్యభామ
                 ఏమంది సత్యభామ
ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునండి
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది
        దూరాన ఆగమంది
ఈ గాలి ఊయల ఊగింది పైఎద
ఈ గాలి ఊయల ఊగింది పైఎద
ఊరించే సైగలతోనే ఏమంది తీయగా
పరువాల తొందర నెలరాజు ముందర
పరువాల తొందర నెలరాజు ముందర
మర్యాద కాదని తానే పలికింది మెల్లగా
          పలికింది మెల్లగా
ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందమామ
ఈ సిగ్గు తెరలలోనా బాగుంది  సత్యభామ
                 ఏమంది సత్యభామ
ఏమందో ఏమో గాని పరిహాసాలే చాలునండి
శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది
        దూరాన ఆగమంది
సిగలోనా పువ్వూలు చిలికించే నవ్వులూ
సిగోనా పువ్వులూ చిలికించే నవ్వులూ
మనకోసం ఏ సందేశం అందించే ప్రేయసి
ఆనంద సీమలో అనురాగ డోలలా
కలకాలం చెల్లిపోని ఆడాలి హాయిగా
అందాలి తీయగా
ఆ మబ్బు తెరల పైనే ఆడింది చందమామ
ప్రేమికుల హృదయం తెలిసి పాడింది చందమామ










Bhali Bhali Bhali Deva




భళి భళి భళి భళి భళి దేవా
బాగున్నదయ నీ మాయ
భళి భళి భళి భళి భళి దేవా
బాగున్నదయ నీ మాయ
బహు బాగున్నదయ నీ మాయ

ఒకరి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పైవారెవరో
నీవారెవరో పైవారెవరో
ఆ వీథికైనను తెలియదయా
బాగున్నదయ నీ మాయ

సుఖదుఖాలతో గుండ్రాకనపడు  లోకము నీ చెలగాటమయా
లీలలు మాయలు నీ గుణ కథలు
లీలలు మాయలు నీ గుణ కథలు
తెలిసిన వారే ధన్యులయా
భళి భళి భళి భళి భళి దేవా
బాగున్నదయ నీ మాయ
బహు బాగున్నదయ నీ మాయ












Hello Darling




హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్  మెరిపిస్తావ్  దరికొస్తే గొడవా
అహఓహోఈహ హహ ఆఆఆఆఆ
మాట మంచి మనకెందుకోయ్
సరి సరిలే నిర్వాకం తెలిసింది పోవోయ్
ఊహు..........

మన ప్రేమ మరిచేవా కనికారం లేదా
కనికారం మమకారం మనకింకా రావు
ఏమే చిలుకా ఇంకా అలకా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా
హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా


దయగంటు మొరవింటు నీ పాదాల్ పడతా
మనలోనా మనకేమి  తలవంపే  చిలుకా
దండాల్ పెడతా సెల్యూట్ కొడతా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా
హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా

పదిమంది ఇది వింటే పరువా మర్యాదా
వదిలేస్తా ఒట్టేస్తా ఇదుగో నీ మీదా
అయితే సరెలే, రైటో పదవే
మనసొకటే మాటొకటే మన జీవాలొకటే
మనసొకటే మాటొకటే మన జీవాలొకటే
అహఓహోఈహ హహ ఆఆఆఆఆ






బ్రహ్మయ్య




బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను
లోకమునే మురిపించే చక్కని ఓ చుక్కను
 నాకు పెళ్ళి చేయనుచే ఇంక బతుకలేనయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
ఏరికోరి తెస్తినిరా నీకు తగిన పిల్లరా
ఏరికోరి తెస్తినిరా నీకు తగిన పిల్లరా
మారుమాట పల్కదురా మురిపెమెల్ల తీర్చుకోరా
మారుమాట పల్కదురా మురిపెమెల్ల తీర్చుకోరా
ఎంత గొప్ప దేముడవో నాదు కోర్కె తీర్చినావు
ఇంక నేను ధన్యుడను నీదు మేలు మరువనయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా

మారుపల్కదేమయ్యా మూగ పిల్లనిచ్చావా
మారుపల్కదేమయ్యా మూగ పిల్లనిచ్చావా
నోరునిచ్చి కావవయ్యా భక్తులతో పరిహాసమా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా

మేలు కోరి ఇస్తినిరా గళము విప్పమనకురా
నోరుగల భార్యలతో నరులు వేగలేరురా
నోరుగల భార్యలతో నరులు వేగలేరురా
నీకెందుకు నేవేగెదా నోరునిచ్చి పోవయ్యా
అయితే ఇక నీ ఖర్మం అనుభవించు తిమ్మయ్యా
తిమ్మయ్యా ఓ తిమ్మయ్యా

ప్రేయసి ఓ ప్రియ... నా ప్రియ
ప్రేయసి ఓ ప్రియ... నా ప్రియ
ప్రియమో చౌకో నోరుమూసుకొని కొనితేవోయ్
ప్రియమో చౌకో నోరుమూసుకొని కొనితేవోయ్
మాయే చేసో సెంటు పౌడర్
నీతికి పోయే బ్యూక్ కార్
గోల్డ్ వాచు ముఖాముల్ స్లిప్పర్
ముచ్చటగొలిపే బొచ్చు కుక్కా
హవ్వా......ఆ.....ఆ
గోల్డ్ వాచీ ముఖామల్ స్టిక్కర్
ముచ్చటగొలిపే బొచ్చు కుక్కా
కోరినవన్నీ నోరుమూసికొని కొనితేవోయ్
లేకపోతే విడాకులోయ్
ఓరా ఎంత గయ్యాళిని మెడకు కట్టినావయ్యా.....ఆ
ఓరా ఎంత గయ్యాళిని మెడకు కట్టినావయ్యా.....ఆ
పోరు తాళలేనయ్యా  నోరు మరల మూయవయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా

నా నోటిని మరల మూయ ఎవరికైనా తరమౌనా
నా నోటిని మరల మూయ ఎవరికైనా తరమౌనా
ఏది రమ్మని చూద్దాం బ్రహ్మ శక్తి తెలిసేను
అవునమ్మా అవునమ్మా అవునవునమ్మా
అవునమ్మా అవునమ్మా అవునవునమ్మా

నా చేతినుకాని పని స్ర్తీల నోరు మూయడమే
నా చేతినుకాని పని స్ర్తీల నోరు మూయడమే
తల్లి నే వాగలేను పోయి వస్తా సెలవీమ్మా
ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు
ఇంతేనా నీ తెలివి ఏమి రాత రాశావు
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా