బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
లోకమునే మురిపించే చక్కని
ఓ చుక్కను
లోకమునే మురిపించే చక్కని
ఓ చుక్కను
నాకు పెళ్ళి చేయనుచే ఇంక బతుకలేనయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
ఏరికోరి తెస్తినిరా నీకు
తగిన పిల్లరా
ఏరికోరి తెస్తినిరా నీకు
తగిన పిల్లరా
మారుమాట పల్కదురా
మురిపెమెల్ల తీర్చుకోరా
మారుమాట పల్కదురా
మురిపెమెల్ల తీర్చుకోరా
ఎంత గొప్ప దేముడవో నాదు
కోర్కె తీర్చినావు
ఇంక నేను ధన్యుడను నీదు
మేలు మరువనయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
మారుపల్కదేమయ్యా మూగ
పిల్లనిచ్చావా
మారుపల్కదేమయ్యా మూగ
పిల్లనిచ్చావా
నోరునిచ్చి కావవయ్యా
భక్తులతో పరిహాసమా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
మేలు కోరి ఇస్తినిరా గళము
విప్పమనకురా
నోరుగల భార్యలతో నరులు
వేగలేరురా
నోరుగల భార్యలతో నరులు
వేగలేరురా
నీకెందుకు నేవేగెదా
నోరునిచ్చి పోవయ్యా
అయితే ఇక నీ ఖర్మం
అనుభవించు తిమ్మయ్యా
తిమ్మయ్యా ఓ తిమ్మయ్యా
ప్రేయసి ఓ ప్రియ... నా
ప్రియ
ప్రేయసి ఓ ప్రియ... నా
ప్రియ
ప్రియమో చౌకో
నోరుమూసుకొని కొనితేవోయ్
ప్రియమో చౌకో
నోరుమూసుకొని కొనితేవోయ్
మాయే చేసో సెంటు పౌడర్
నీతికి పోయే బ్యూక్ కార్
గోల్డ్ వాచు ముఖాముల్
స్లిప్పర్
ముచ్చటగొలిపే బొచ్చు
కుక్కా
హవ్వా......ఆ.....ఆ
గోల్డ్ వాచీ ముఖామల్
స్టిక్కర్
ముచ్చటగొలిపే బొచ్చు
కుక్కా
కోరినవన్నీ నోరుమూసికొని
కొనితేవోయ్
లేకపోతే విడాకులోయ్
ఓరా ఎంత గయ్యాళిని మెడకు
కట్టినావయ్యా.....ఆ
ఓరా ఎంత గయ్యాళిని మెడకు
కట్టినావయ్యా.....ఆ
పోరు తాళలేనయ్యా నోరు మరల మూయవయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
నా నోటిని మరల మూయ
ఎవరికైనా తరమౌనా
నా నోటిని మరల మూయ
ఎవరికైనా తరమౌనా
ఏది రమ్మని చూద్దాం
బ్రహ్మ శక్తి తెలిసేను
అవునమ్మా అవునమ్మా
అవునవునమ్మా
అవునమ్మా అవునమ్మా
అవునవునమ్మా
నా చేతినుకాని పని
స్ర్తీల నోరు మూయడమే
నా చేతినుకాని పని
స్ర్తీల నోరు మూయడమే
తల్లి నే వాగలేను పోయి
వస్తా సెలవీమ్మా
ఇంతేనా నీ తెలివి ఏమి రాత
రాశావు
ఇంతేనా నీ తెలివి ఏమి రాత
రాశావు
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా
No comments:
Post a Comment