Saturday, 5 May 2018

Hello Darling

హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్  మెరిపిస్తావ్  దరికొస్తే గొడవా
అహఓహోఈహ హహ ఆఆఆఆఆ
మాట మంచి మనకెందుకోయ్
సరి సరిలే నిర్వాకం తెలిసింది పోవోయ్
ఊహు..........

మన ప్రేమ మరిచేవా కనికారం లేదా
కనికారం మమకారం మనకింకా రావు
ఏమే చిలుకా ఇంకా అలకా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా
హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా

దయగంటు మొరవింటు నీ పాదాల్ పడతా
మనలోనా మనకేమి  తలవంపే  చిలుకా
దండాల్ పెడతా సెల్యూట్ కొడతా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా
హలో డార్లింగ్ మాటాడవా
మురిపిస్తావ్ మెరిపిస్తావ్ దరికొస్తే గొడవా

పదిమంది ఇది వింటే పరువా మర్యాదా
వదిలేస్తా ఒట్టేస్తా ఇదుగో నీ మీదా
అయితే సరెలే, రైటో పదవే
మనసొకటే మాటొకటే మన జీవాలొకటే
మనసొకటే మాటొకటే మన జీవాలొకటే
అహఓహోఈహ హహ ఆఆఆఆఆ

No comments:

Post a Comment