నా రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది
నా రక్తపు ధరయేమో రోజురోజు తగ్గపట్టే
రక్తంతో నడుపుతాను రిక్షాను
నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
రిక్షా టైరువోలే మన బతుకులు అరిగిపాయే
చక్రాల్లో బాల్స్ వోలే మన గుండెలు కరిగిపాయే
మన కండలు కరిగిపోయి సీటు కింద దిండులాయే
రిక్షాలో ఆయిల్ వోలే మన నెత్తురు ఒడిసిపాయే
ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు
ఎన్నాళ్లు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు
బతుకు కోసం బలిసినోళ్ల టైరు కింద తోసి బతుకు
రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
తొక్కి తొక్కి నా ఊపిరితిత్తులన్నీ చెడిపాయే
దగ్గి దగ్గి గొంతులన్నీ పుచ్చిపోయి జల్లెడాయే
గుడ్లు, పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే
గుడ్లు, పండ్లు మంచి తిండి తినమని డాక్టరు చెప్పే
తిండే దొరకకపోతే మంచి తిండికియేడబోను
రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
దొర బండ్లకి ఇన్సురెన్స్ దొర కార్లకి ఇన్సురెన్స్
దొర పక్కకి ఇన్సురెన్స్ దొర కుక్కకి ఇన్సురెన్స్
మార్వాడి సేఠుగాని బీరువాకి ఇన్సురెన్సు
ఆల్సేషెన్ కుక్క కన్నా అధ్వానం మన బతుకు
రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
దొర అని మేమంటే ఒరే తురే అంటాడు
వీపు మీద కాలు పెట్టి తొయ్యెరా నా కొడుకంటడు
గాలిలోనా ఎగిరి దూకే ఎరోప్లేనులు ఎన్నున్నా
జయ్యిన ఉరికేటి జోరుదారు కార్లున్నా
జయ్యిన ఉరికేటి జోరుదారు కార్లున్నా
మనిషిని మనిషే మోసే మనిషి బతుకు మారలేదు
రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోలు
No comments:
Post a Comment