మల్లెతీగకు పందిరివోలే మస్కచీకటిలో వెన్నెలవోలే
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
పెద్దమనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూనే దానిని చూడొద్దంటరు నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటి నే అన్నను గాను చెల్లమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలే చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలే మస్కచీకటిలో వెన్నెలవోలే చెల్లెమ్మా
సిన్నపోయి నువ్వు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్క క్షణం నువ్ కనపడకుంటే నా కనుపాపలు కమిలిపోతాయి
సిన్నపోయి నువ్వు కూసున్నవంటే ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్క క్షణం నువ్ కనపడకుంటే నా కనుపాపలు కమిలిపోతాయి
ఒక్క గడియ నువ్ మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షినౌతామ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువ్ అలిగినావంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగనంతా పనైతదమ్మా చెల్లమ్మా
మల్లెతీగకు పందిరివోలే మస్కచీకటిలో వెన్నెలవోలే చెల్లెమ్మా
చదివినంతా నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
చదివినంతా నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి పువ్వో పత్తో కూడపెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా చెల్లెమ్మా
రిక్షాబండినే మేనా కడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా
మల్లెతీగకు పందిరివోలే మస్కచీకటిలో వెన్నెలవోలే చెల్లెమ్మా
No comments:
Post a Comment