Saturday, 5 October 2019

Goruvanka Valagaane



గోరువంక వాలగానే గోపురానికి 
స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి 
పెదాల గిల గిల పువ్వులే పుట్టలేదా
బాలక్రిష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుడ్ని చూసినప్పుడే 
వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తన వాడై...

గోరువంక వాలగానే గోపురానికి 
స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి 
పెదాల గిల గిల పువ్వులే పుట్టలేదా

ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన
పడి లేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోనా ఎల్లాకిల్లా పడ్డట్టున్నా
అల్లో మల్లో ఆకాశానా  చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మా
అబ్బాయంటే సూరిడమ్మా
ఇంటి దీపాలవ్వలంటా దిక్కుల్లో

ఎవరికి వారే....
యమునకు వీరే....
రేవు నీరు నావదంటా
నావ తోడు రేవుదంటా పంచుకుంటే


గోరువంక వాలగానే గోపురానికి 
స్వరాల గణ గణ  గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి 
పెదాల గిల గిల పువ్వులే పుట్టలేదా

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనుసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటలాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే 
పేరంటాల పూలు నవ్వే 
గోపెమ్మొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో
పరవశమేదో....
పరిమళమాయే....
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
 జివ్వు మన్న జన్మ నవ్వే
 పాడుతుంటే...

గోరువంక వాలగానే గోపురానికి 
స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి 
పెదాల గిల గిల పువ్వులే పుట్టలేదా
బాలక్రిష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుడ్ని చూసినప్పుడే 
వరాల వాంఛలన్నీ పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తన వాడై...





 




 
 

No comments:

Post a Comment