Tuesday, 29 October 2019

Andala Chinni Devatha

సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు 

సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
అందాల చిన్నిదేవత 
ఆలయమే చేసి మా ఎద 
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా
అనురాగం కంటిచూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతుకంతా నిండుపున్నమై
ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై
సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
 
పువ్వులెన్నో పూచే నువ్వు నవ్వగానే
ఎండవెన్నెలాయే నిన్నుచూడగానే
నీడ పడితే, బీడు పండాలి
అడుగుపడితే సిరులు పొంగాలి
కల్మషాలు లేని కోవెలంటి ఇల్లు మాది
స్వచ్చమైన ప్రేమే పందిరల్లే అల్లుకుంది
స్వార్దమన్న మాటే  మనసులోంచి తుడిచిపెట్టి
స్నేహబాటలోనే సాగుదాము జట్టు కట్టి 
ఎండ కన్న వెచ్చనైనా
వాన కన్నస్వచ్చమైన ప్రేమ బంధంమే మాదిలే
సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు

అందాల చిన్నిదేవత 
ఆలయమే చేసి మా ఎద 
అమృతమే మాకు పంచగా
అంతా ఆనందమే కదా
అనురాగం కంటిచూపులై
అభిమానం ఇంటి దీపమై
బ్రతుకంతా నిండుపున్నమై
ముడివేసే పూర్వపుణ్యమే
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై

స్వాతి ముత్యమల్లే పెరిగినట్టి చెల్లి
కల్పవృక్షమల్లే కరుణచూపు తల్లీ
నలకపడితే కంటిలో నీకు 
కలత పెరుగు గుండెలో మాకు
అమృతాన్ని మించే మమత మాకు తోడు ఉంది
మాట మీద నిలిచే అన్న మనసు అండ ఉంది
రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది
కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది
నేల మీద ఎక్కడైనా కాన రాని సాటి లేని ఐకమత్యమంటే మాదిలే

సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు
శ్రీలక్ష్మి దేవి రూపము
శ్రీగౌరి దేవి తేజము
కలిసి మా చెల్లి రూపమై
వెలిసే మా ఇంటి దేవతై 
సహనంలో సీత పోలిక
సుగుణంలో స్వర్ణమేనిక
దొరికింది సిరుల కానుక
గత జన్మల పుణ్యఫలముగా
కలకాలం అన్నలకు ప్రాణమై
మమకారం పంచవే అమ్మవై
సంతోషపడుతు శతకోటి దేవతలు పలికెను దీవెనలు
శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్ళు

No comments:

Post a Comment