Tuesday, 29 October 2019

GALLI CHINNADI

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నవీ
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
గల్లీ సిన్నదీ
ఆ ఇళ్ళకన్న మేలురా ఫలక్ నామా బళ్ళురా
పాత రైలు డబ్బలోలే పడాఉన్నవేందిరో గల్లీ సిన్నది
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నవీ
  గల్లీ సిన్నదీ
తుమ్మై గడపలు తుప్పు పట్టిన చిలుకులు
పుచ్చితోని తలుపులేమో పెచ్చులూడి ఉంటయీ
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
ఎత్తు మనిషి చుట్టమై కొత్త ఇంటికొస్తెరో పైన గడప తగిలి నెత్తి బొప్పి కట్టి పోతదో గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
దర్వాజలిరుగు దగ్గర జరిపి కట్టుకుంటరో
లావుకున్నకోడిపుంజు కూర కష్టమైతదో
గల్లీ సిన్నదీ

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
కలిగినోళ్ల కాలనీల వరద మురుగునీళ్ళురా 
వీళ్ళ నల్లా పైపుతోనే  వియ్యమందుకుంటయో  
గల్లీ సిన్నదీ

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
వెలుగుతున్న బల్బులా వెలుతురెంత ఉందిరా
నూటికొక్క ఇంట్లకుడా టూబులైటులేదొరో
గల్లీ సిన్నదీ 

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
సెకండ్ హ్యాండ్ టీవిరా దాని శబ్దమేందొ చూడరా
లోటలో రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తదో 
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
ఇంటికొక్క గాథరా విచారిస్తే బాధరా
 గాథలన్నీ తెల్సుకుంటే గుండె గాభరైతదో 
గల్లీ సిన్నదీ 

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
పాత పంపు ఇనుప టెంకి రోడు మీద పెట్టుకొని
గాలికొట్టే పొరడేమో జాలిగా చూస్తుంటడో 
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
పల్సరున్న పట్టపై ప్రాణాలు పెట్టుకుంటడో
 డొక్కు స్కూటరొస్తదని దిక్కులుచూస్తుంటడో 
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
నడుములొంచి తొక్కెటి నాల్గు కిలోల బండిరా
ఉల్లిగడ్డ అమ్మితేనే కడుపులో కురుపొస్తదో
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
మూడు జాన్ల పోరడు 
వాని బాధలేమో బారెడు
వాడు చేసే దందా సారెడు
వానికేడ తీరు బాధలు
గల్లీ సిన్నదీ

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
కాలే కడుపకాసరా గాలి బుంగలమ్ముడు
పిన్నీసలు రిబ్బన్లు కన్నీరు తుడ్చునా
గల్లీ సిన్నదీ
గల్లి సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లి సిన్నదీ
కల్లుపాక ఎల్లమ్మ గుడి కల్సుకోని ఉంటవి
తాగినోళ్ళు ఊగుకుంట రాగమెత్తుకుంటరో
గల్లి సిన్నదీ
గల్లి సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
గల్లి సిన్నదీ
ఇరుకు ఇంట్ల నరకమయి వీధీలల్లకొస్తరో
పోరలేమో దుమ్ములోన పొర్లాడుతుఉంటరో
గల్లీ సిన్నదీ

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
కోరి కోరి వారములా కూర తెచ్చుకుంటరో
పూదీన కోతిమీర దాన్లో కలుపుకుంటరో 
గల్లీ సిన్నది

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
అల్లంవెల్లుల్లిపాయ దంచి మసాల దట్టించిన
మోరి గాలి వాసనకు కూర కంపుకొడతదో 
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
దువ్వుకునే దువ్వెన పళ్ళిరిగిపోయి ఉంటది
ఎవ్వరింట్ల చూసిన అద్దమెందుకో పగిలుంటదీ
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
చిత్తుబొత్తుకు బతుకులు 
సిన సిన దందలూ
చిల్లర కొట్లల్లా వాళ్లు చిన్న ఖాతాలెడతరో
గల్లీ సిన్నదీ

గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ
ఏండ్లకేళ్ళు గడిచేరా
ఎట్టి బతుకులింతెరా
ఎవరేలిన గాని గల్లీ రూపమేమి మారెరా
గల్లీ సిన్నదీ
గల్లీ సిన్నదీ గరిబోల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇల్లు కిళ్లి కొట్లకన్న చిన్నగున్నయీ
  గల్లీ సిన్నదీ

No comments:

Post a Comment