Wednesday, 25 March 2020

Allari Krishnudu



అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 
ఎవ్వరి వాడమ్మా
ఎవ్వరి వాడమ్మా
రేవతి కొడుకా, యశోద కొడుకా
ఎవరమ్మా తన అమ్మా
ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా 

ఎవరమ్మా తన అమ్మా
                                 ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా
అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 
ఎవ్వరి వాడమ్మా
ఎవ్వరి వాడమ్మా

కానక కానక కన్నతల్లిని దేవకిని నేను
కనివిని ఎరుగని రీతిని పెంచిన తల్లి యశోదను నేను
కానక కానక కన్నతల్లిని దేవకిని నేను
కనివిని ఎరుగని రీతిని పెంచిన తల్లి యశోదను నేను
నవమాసాలు మోసి చెరసాలలోన కన్నాను
నవనీతాలే తినిపించి బారసాల నే చేశాను
ఇది కన్నకడుపు తీపి
ఇది అంత కన్న తీపి

అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 
ఎవ్వరి వాడమ్మా
ఎవ్వరి వాడమ్మా
రేవతి కొడుకా, యశోద కొడుకా
ఎవరమ్మా తన అమ్మా
ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా 

ఎవరమ్మా తన అమ్మా
                                 ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా
అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు 
ఎవ్వరి వాడమ్మా
ఎవ్వరి వాడమ్మా

కంసుడు హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను
కన్నతల్లి నేనయ్యి కన్నయ్యను పెంచాను
కంసుడు హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను
కన్నతల్లి నేనయ్యి కన్నయ్యను పెంచాను
ప్రాణాలైనా ఇస్తా, నా తండ్రిని నాకిస్తే
నా ప్రాణమే వాడు, వాడి ప్రాణమే నేను
నిజం చెప్పారా కన్నా ఎవరు నీకు అమ్మా

ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డను కృష్ణుడు నేనమ్మా
నాకిష్టులు మీరమ్మా
దేవకి ఎవరో , యశోద ఎవరో
ఒక అమ్మా పేరు ప్రేమ, ఒక అమ్మ పేరు పాశం
ఒక అమ్మా పేరు ప్రేమ, ఒక అమ్మ పేరు పాశం

 
 

 

 
 

 

 

No comments:

Post a Comment