Tuesday, 9 June 2020

Padana Shillalu



పాడనా శిలను కరిగించి గీతం
పరమేశ్వరుడే ఇలకేతెంచి
పులకించి నర్తించు నవ నాట్యవేదం
పాడనా మదిని మురిపించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం
పాడనా....
నారద ప్రణిపాతం స్వరభారతి పదపీఠం 
ఓంకార నాదాల నిగమార్ధ సారం.. సంగీతం
వెన్నెల జలపాతం, మరుమల్లెల మణిదీపం
స్వరరాగ రసయోగ గంగా ప్రవాహం.. సంగీతం
థిగంతాల శృతి సుగంధాలు వెదజల్లును సంగీతం
పాడనా శిలను కరిగించి గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం
స నిస దనిస మదనిస గమదనిస సగమదనిస
ససనినిదా నినిదదమ గస గస నిసని దనిద  మద గమదనిస
తుంఋర వరదానం తొలినాచల పరిదానం
మంధార మకరంద మాధుర్య పానం... నా గానం

తుమ్మెద ఝంకారం నా పాటకి శ్రీకారం
పరువాల పరవళ్ళ సెలయేటి వేగం... నా రాగం

కళాభారతికి దశఘాతమది ఏమిరా నీ గీతం

పాడనా మదిని మురిపించు గీతం
స్వరమాధురిలో మనసే నెమలై
పురివిప్పి ఆడేటి ఆనంద గీతం

నాద బ్రహ్మ గురు  త్యాగరాజ కృత పంచరత్నముల
ఇంచుమించు సరిసాటి ఐనా మమ గానవాహినికి
మంజుల మార్దవ మానస గీతికి
ఊపిరిలాడక స్వరములు తోచక
తికమక పడి పడి పదములు తడబడి
శృతి తప్పి మతిపోవు పసివాడవు
జన్య జనకాల ధన్య గమకాల
నా మూర్చనలకించ మూర్చిల్లిపోతావు
పాడనా..పాడనా

గలగల పారే సెలయేరమ్మా సరిగమలంటే నేర్పింది
కిలకిల పాడే ప్రతి గువ్వమ్మ గమకములంటే చూపింది
అమ్మ పాటలో లాలి పాలన చిన్ని పాపలో హాయి భావన
గాలి తరగలో గాన మధురిమ పేద వెలుగులో ప్రాణ స్పందన
కడలి అలల కమనీయ కీర్తన
పుడమి ఎదను చిలుకమ్మ నర్తన
సుప్రభాత సుమరాగరంజన సూర్యదేవ కిరణాల దీవెన
వేదమంత్రముల నాద ఘోషణ కాగితాలలో కావ్వ వేదన
గుండె గూటిలో వాయులీనమై కంటి పాపలో స్వప్న రాగమై
గాన పధంబున నను నడిపించే జాన  పదంముల జాను తెలుగు
తొలి పాట తల్లి నా జోతలందుకొని పొంగిపోగా  

పాడనా మదిని మురిపించు  గీతం




 
 


No comments:

Post a Comment