Tuesday, 18 August 2020

cheliya ninu chudakunda Undalenamma

 

 

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు

నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు

నా గుండెల్లో చొరపడిపోయావే

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

 

నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలిని

నా చెలి నుదుటికి అందానిచ్చే సింధూరమై

కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై

అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై

గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే

గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో

నా ప్రేమ రాశివి నువ్వే హ.....

నా ఊపిరి  చిరునామా నువ్వే 
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

 

మనసా వాచే నీ మదిలోన కొలువుండనా

నా నిలువెల్లా దాసోహలే చేసేయనా

ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా

ఏడడుగులతో కొంగుముడేస్తా ఏదేమైనా

నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా 

నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా

నా రెండు కన్నులు నువ్వే హ....

నా చంటి పాపవు నువ్వే...

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా

నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు

నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు

నా గుండెల్లో చొరపడిపోయావే 

చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా

 

 

 

 

 

 

 

 

 

 

Andamyna kundanala bommara

         

 

అందమైన కుందనాల బొమ్మరా

  చందనాల నవ్వు చల్లి పోయెరా

  అందమైన కుందనాల బొమ్మరా

  చందనాల నవ్వు చల్లి పోయెరా 

 ఏఇంటి వనితో మరి నాఎద మీటిపోయే చెలి

  ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆసుందరి

  అందమైన కుందనాల బొమ్మరా 

 చందనాల నవ్వు చల్లిపోయెరా 

 

  అనుకోకుండానే నేను చూశాను ఆమెను 

 ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనసును

  అనుకోకుండానే నేను చూశాను ఆమెను 

 ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనసును

  ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను 

 చూడకుండా ఉండలేను ఏం చెయ్యను 

 ఏమో.. ఏమేడల్లో దాగి ఉందోరా 

 అందమైన కుందనాల బొమ్మరా 

 చందనాల నవ్వు చల్లిపోయెరా

  

  ఏపని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి 

 చూపుల వలవేసి తీసుకెలుతోంది తన వెంబడి  

ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి  

చూపుల వలవేసి తీసుకెలుతోంది తన వెంబడి 

 ఒక్కసారి చేరాలి ఆనీడను

  విన్నవించుకోవాలి ఈబాధను 

 ప్రాణం.. పోతున్నట్టుగా ఉందిరా 

 అందమైన కుందనాల బొమ్మరా 

 చందనాల నవ్వు చల్లిపోయెరా  

ఏఇంటి వనితో మరి నాఎద మీటి పోయేచెలి

  ఏచోట ఉందో మరి నాప్రియమైన ఆసుందరి 

 అందమైన కుందనాల బొమ్మరా 

 చందనాల నవ్వు చల్లి పోయెరా

 

 









Nuvvu Yaadikelthe Aadikosta Suvarna

 
 
 
నువు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ
నీ ఇంటి పేరే మారుస్తా సువర్ణ
బంగారం మారు పేరు సువర్ణ
నా బంగారం నువ్వమ్మ సువర్ణ 
 
నువు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ
నీ ఇంటి పేరే మారుస్తా సువర్ణ
బంగారం మారు పేరు సువర్ణ
నా బంగారం నువ్వమ్మ సువర్ణ 
నా వాలుజడల రోజా చేస్తాను ప్రేమ పూజ
ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మా
మరి చేత కాదు నన్ను ఇంకా ఏడిపించకే 
వినవే 
కసిరే అమ్మాయి, నడుమే సన్నాయి
నడిచే శిల్పమోయి,సొంతమైతే హాయి
నువు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ
నీ ఇంటి పేరే మారుస్తా సువర్ణ
 
యంగ్ గర్లకి బుల్లి బుగ్గలు
 ఉన్నవెందుకో నీకు తెలుసునా
హాయి హాయిగా బాయ్ ఫ్రెండుతో ముద్దుకోసమే తెలుసుకోవే 
లిప్ స్టిక్ పెదవులకు రాసేది ఎందుకో
 చెబుతా రీసనింగ్ ఓ భామ తెలుసుకో
కుర్రాడి చూపు పడేందుకేలే ఇలాంటి సోకు ఓ నా మైనా
తిడుతు తిడుతునే నను చూస్తున్నావే
నీ మనసు నాకు చెప్పే  ఐ లవ్ యు
ఆ బ్రహ్మ నిన్నుపంపినాడు నాకు గిఫ్ట్ గా
నిజమే నువ్వే నా పవర్రు నువ్వే నా ఫిగర్రు నువ్వే నా లివర్రు నువ్వే నా లవర్రు
నువు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ
నీ ఇంటి పేరే మారుస్తా సువర్ణ
నువు కరుణిస్తే కసమ్ నౌత సువర్ణ
నువు కాదంటే చచ్చిపోతా సువర్ణ
 
నా అనుమతి తీసుకోకనే గుండెలోనికి దూసుకొస్తువే
ఎన్ని గుండెలే నీకు అమ్మడు మనసు మొత్తము దోచికెలితివే
కిల కిల నీ నవ్వు గుర్తొస్తు ఉన్నదే
నిద్దరపోతున్న డిస్టబ్ర్ చేస్తున్నదే
నరాలలోన కరెంటు నింపే మిరాకిల్ ఏదో నీలో ఉందే
సి.యమ్ పదవైనా బిల్ గేట్సు ధనమైనా ఇట్టే  వదిలేస్త నీ కోసం
బ్రహ్మ నన్ను పుట్టించెను నీకు హాఫ్ గా
ప్రామిస్
ఇటు రావే పిట్టా నా జిలేబి పుట్టా
నిను చూస్తుంటే అట్టా నా ప్రాణమాగదట్టా
నువు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ
నీ ఇంటి పేరే మారుస్తా సువర్ణ
బంగారం మారు పేరు సువర్ణ
నా బంగారం నువ్వమ్మ సువర్ణ
 
 
 
 
 
 
 


 

  

Devudu varamandiste ne ninne korukuntale

 

 

 
 
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే
 
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే 
 
కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే

 
మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే
మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే
నా మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే
మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే
నిను మేఘాన ఒక బొమ్మ గావించగా
నే మలిచాను హరివిల్లు నీ కుంచెగా
ఈ చిరుగాలితో చెప్పనా నీ  మది నిండ నేనుండగా 
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే 

ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా
కొంగు ముడిని వేయాలంటు నిన్ను  వేడుకుంటున్నా
ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా
కొంగు ముడిని వేయాలంటు నిన్ను  వేడుకుంటున్నా
నా కలలన్నీ నీ కనులు చూడలనీ
బతిమలాను నీ కంటిలో పాపనీ
మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనీ
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే 
 
కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం
తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం
నా ఊపిరి చిరునామా నువ్వే
 
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే
నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే

 
 
 


 

 
 
 


 

 
 
  

Picaso chitrama Yellora shilpama

 

 

 పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

  నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్

  నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 

 

  నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా 

 నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ 

 ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై 

 ఏ వింటి శరమో అది నీ కంటి వశమై

  అంగాంగాన శృంగారాన్ని సింగారించగా 

 అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా 

 మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా 

 వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా 

 ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి 

 ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని 

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

 

  ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా

  నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాలా

  నీ చూపు తగిలి ఇక నేనుండగలనా 

 నా బాధ తెలిసి జత రావేమె లలనా 

 నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా  

నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా 

 ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా

  లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా 

 ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి

  నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

  నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలి సలామ్ 

 నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ 

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

 

Keeravani Ragamlo Plichindoka Hrudayam

 

 

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం

గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట 

నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట 

 వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా 

 మెరుపులా మైమరపులా జత చేరగా రావా  

కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం 

 కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం

 

  మంచువెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో

  వలపు వాకిట వేచి నిలచిన వయసుపల్లకిలో

  ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగారశిల్పానివా

  కళ్యాణరాముని కౌగిట్లో ఒదిగిన బంగారుపుష్పానివా 

 పంచుకో ప్రియతమా ప్రేమనీ

 ప్రేమగా తియ్యగా తియతియ్యగా

 తమకానివై ప్రేమా

  కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం 

 కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం 

 

  కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా 

 కౌగిలింతల కాటు వేయకు చిలిపి చందురుడా

  వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా 

 మందారపెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా 

 అందుకో అధరమే హాయిగా ఏకమై

  ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా 

  కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం

  కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం 

 గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట 

నిన్ను తాకి పొంగిపోవు 

నీలిమబ్బును నేనంట 

 వానలా వచ్చి వరదలా

 పొంగు ప్రేమవే నీవా

  మెరుపులా మైమరపులా జత చేరగా రావా 

  కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం  

కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం