Tuesday, 18 August 2020

Picaso chitrama Yellora shilpama

 

 

 పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

  నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్

  నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా 

 

  నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా 

 నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ 

 ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై 

 ఏ వింటి శరమో అది నీ కంటి వశమై

  అంగాంగాన శృంగారాన్ని సింగారించగా 

 అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా 

 మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా 

 వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా 

 ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి 

 ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని 

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

 

  ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా

  నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాలా

  నీ చూపు తగిలి ఇక నేనుండగలనా 

 నా బాధ తెలిసి జత రావేమె లలనా 

 నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా  

నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా 

 ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా

  లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా 

 ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి

  నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

  నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలి సలామ్ 

 నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ 

  పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

 

No comments:

Post a Comment