కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట
నిన్ను తాకి పొంగిపోవు నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
మంచువెన్నెల స్నానమాడిన మల్లెపందిరిలో
వలపు వాకిట వేచి నిలచిన వయసుపల్లకిలో
ఏకాంతసేవకు ఉర్రూతలూగిన శృంగారశిల్పానివా
కళ్యాణరాముని కౌగిట్లో ఒదిగిన బంగారుపుష్పానివా
పంచుకో ప్రియతమా ప్రేమనీ
ప్రేమగా తియ్యగా తియతియ్యగా
తమకానివై ప్రేమా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
కదనసీమకు కాలు దువ్విన గడుసు మన్మధుడా
కౌగిలింతల కాటు వేయకు చిలిపి చందురుడా
వేవేల సొగసులు వెచ్చంగ పొదిగిన వయ్యారి ముందుండగా
మందారపెదవుల గంధాలు తీయక అయ్యారే ఉండేదెలా
అందుకో అధరమే హాయిగా ఏకమై
ఘాటుగా అలవాటుగా తెరచాటుగా భామా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
గాలిలోన తేలిపోవు రాజహంసవు నీవంట
నిన్ను తాకి పొంగిపోవు
నీలిమబ్బును నేనంట
వానలా వచ్చి వరదలా
పొంగు ప్రేమవే నీవా
మెరుపులా మైమరపులా జత చేరగా రావా
కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం
కొత్త కొత్త ఊహలతో వణికిందొక అధరం
No comments:
Post a Comment