చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా గుండెల్లో చొరపడిపోయావే
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నెచ్చెలి పైటకు వెచ్చగా తాకే చిరుగాలిని
నా చెలి నుదుటికి అందానిచ్చే సింధూరమై
కమ్మని కలగా రమ్మని పిలిచే నా నేస్తమై
అక్కున చేర్చుకు ఆరాధించే నా ప్రాణమై
గున్నమావి తోటల్లోన నే ఎదురు చూస్తాలే
గుప్పెడంత గుండెల్లోన చోటిస్తా రావయ్యో
నా ప్రేమ రాశివి నువ్వే హ.....
నా ఊపిరి చిరునామా నువ్వే
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
మనసా వాచే నీ మదిలోన కొలువుండనా
నా నిలువెల్లా దాసోహలే చేసేయనా
ఎల్లలు లేని ప్రేమకు ద్వారం తెరిచేయనా
ఏడడుగులతో కొంగుముడేస్తా ఏదేమైనా
నీ వెంటే నడిచొస్తాను ఆ నింగి దాటైనా
నువ్వంటే పడి చస్తాను రేయైనా పగలైనా
నా రెండు కన్నులు నువ్వే హ....
నా చంటి పాపవు నువ్వే...
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
నిను చూస్తే రోజు నాకు పండగేనమ్మా
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా అడుగులలో అడుగేస్తు నా మది లోయల్లో చూస్తు
నా గుండెల్లో చొరపడిపోయావే
చెలియ నిను చూడకుండా ఉండలేనమ్మా
No comments:
Post a Comment