అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
ఏఇంటి వనితో మరి నాఎద మీటిపోయే చెలి
ఏచోట ఉందో మరి నా ప్రియమైన ఆసుందరి
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లిపోయెరా
అనుకోకుండానే నేను చూశాను ఆమెను
ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనసును
అనుకోకుండానే నేను చూశాను ఆమెను
ఆపే వీల్లేక ఆమెతో పాటు నామనసును
ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను
చూడకుండా ఉండలేను ఏం చెయ్యను
ఏమో.. ఏమేడల్లో దాగి ఉందోరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లిపోయెరా
ఏపని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వలవేసి తీసుకెలుతోంది తన వెంబడి
ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి
చూపుల వలవేసి తీసుకెలుతోంది తన వెంబడి
ఒక్కసారి చేరాలి ఆనీడను
విన్నవించుకోవాలి ఈబాధను
ప్రాణం.. పోతున్నట్టుగా ఉందిరా
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లిపోయెరా
ఏఇంటి వనితో మరి నాఎద మీటి పోయేచెలి
ఏచోట ఉందో మరి నాప్రియమైన ఆసుందరి
అందమైన కుందనాల బొమ్మరా
చందనాల నవ్వు చల్లి పోయెరా
No comments:
Post a Comment