ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని
అధికార ముద్రిక లంతరించె
ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూ
సల సౌరు గంగలో కలిసిపోయె
ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న
చిత్రలేఖకుని కుంచియ నశించెఇది పిశాచులతో నిటాలేక్షణుండు
గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు
ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ
అవనిపాలించు భస్మ సింహాసనంబు
No comments:
Post a Comment