Sunday, 26 September 2021

Urakalai Godavari

 
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
 రసమయం జగతి 
 ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 
  నీ ప్రణయ భావం నా జీవరాగం 
 నీ ప్రణయ భావం నా జీవరాగం 
 రాగాలు తెలిపే భావాలు నిజమైనవి 
 లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి 
 అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది 
  ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
 రసమయం జగతి 
 
  నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
 నా పేద హృదయం నీ ప్రేమ నిలయం 
 నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది 
 నీవన్న మనిషే ఈనాడు నాదైనది 
 ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది
  ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి  
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి 
 జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి 
 చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి 
  రసమయం జగతి
 

 

No comments:

Post a Comment