ఒళ్లంతా ముళ్లున్నా ఒడి మెత్తనోయమ్మా
కొల్లలగా పిట్టలకు కొలుకు నీ ఇల్లమ్మా
కాటుక పూతల నీ తనువు నలుపున్నా
కడుపులో జాలోలే పసుపూరుతావమ్మా
చిగురాకులే గాని కొప్పెంతో చిక్కనా
నీ పసరు గాలి విసిరే మరిమళం చక్కనా
ఓ నల్లతుమ్మా నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా
నువ్ లేక పల్లె చిరునామా లేదమ్మా
గులకరాళ్ల చవుకు నేలైనా మొలిచేవు
గుట్టలు రాళ్లున్నా గుబురుగా పెరిగేవు
పెట్టుపోతల కొరకు పెట్టుకోవు బెంగా
మేక పంచకముంటే అదే నీకు సుర గంగా
మేక పంచకముంటే అదే నీకు సుర గంగా
పాలు మరసిన మేక పాలు నీ పిందెలు
కాలు కదిపిన లేత కాళ్లకు అందెలు
కమ్మగడతో కొమ్మ లొంచే యలమందలు
కమ్మని విందుకై జతగూడే మందలు
నీ పూలు కురిసిన పుప్పోడి సిందుల్లో తడిసి స్నానమాడు గడుసు తుమ్మెదలు
No comments:
Post a Comment