మాయ సంసారం తమ్ముడు
ఇది మాయ సంసారం తమ్ముడు
నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడు
మాయ సంసారం తమ్ముడు
నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడు
మాయ సంసారం తమ్ముడు
ముఖము అద్దము ఉంది మొగమాటమెందుకు
సుఖదుఖములు లెక్క చూసుకో తమ్ముడు
ముఖము అద్దము ఉంది మొగమాటమెందుకు
సుఖదుఖములు లెక్క చూసుకో తమ్ముడు
సకల సమ్మోహన సంసారమందున
సకల సమ్మోహన సంసారమందున
సుఖాలు సున్నా దుఖాలే మిగులన్నా
సుఖాలు సున్నా దుఖాలే మిగులన్నా
మాయ సంసారం తమ్ముడు
నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడు
మాయ సంసారం తమ్ముడు
కోరి తెచ్చుకున్నా భారమంతేకాని
ధారా పుత్రులు నిను ధరి చేర్చుతారా
కోరి తెచ్చుకున్నా భారమంతేకాని
ధారా పుత్రులు నిను ధరి చేర్చుతారా
తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
తేరి చూసి నిజము తెలుసుకో తమ్ముడు
కాలం సత్యం సర్వం పరమాత్మ
మాయ సంసారం తమ్ముడు
నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడు
మాయ సంసారం తమ్ముడు
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
వచ్చినప్పుడు వెంట తెచ్చినదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది
పోయేటప్పుడు కొని పోయేదేముంది
అద్దే కొంప, లోకమంతేగా తమ్ముడు
అద్దే కొంప, లోకమంతేగా తమ్ముడు
వద్దు పొమ్మనగానే వదిలేసి పోవాలి
మాయ సంసారం తమ్ముడు
నీ మదిలో సదా శివుని మరువకు తమ్ముడు
మాయ సంసారం తమ్ముడు
నమ్ముకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలు బొమ్మలురా జీవా
నమ్ముకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలు బొమ్మలురా జీవా
సమ్మతించి నను నమ్మినవారికి సాయుధ్యంరా జీవా
శివ సాన్నిద్యంరా జీవా
సమ్మతించి నను నమ్మినవారికి సాయుధ్యంరా జీవా
శివ సాన్నిద్యంరా జీవా
మొహపూరిత సంసార జలధిలో జ్ఞానమే చేయూత
అజ్ఞానమే ఎదురీత
జ్ఞానమే చేయూత ,అజ్ఞానమే ఎదురీత
జీవా
జ్ఞానమే చేయూత ,అజ్ఞానమే ఎదురీత
మొహమెందుకీ ఈ దేహముపై
ఇది తోలు తిత్తిరా జీవాఉత్త గాలి తిత్తిరా జీవా
మొహమెందుకీ ఈ దేహముపై
ఇది తోలు తిత్తిరా జీవాఉత్త గాలి తిత్తిరా జీవా
నమ్ముకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలు బొమ్మలురా జీవా
నమ్ముకురా ఇల్లాలు పిల్లలు
బొమ్మలురా జీవా తోలు బొమ్మలురా జీవా
No comments:
Post a Comment