కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలినితేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా
ప్రేమలు పూచే సీమల లోపల
ప్రేమలు పూచె సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తెలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా
కన్నె తారకల కలగానముతో
కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
No comments:
Post a Comment